డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్టణంలో భాష్యం స్కూల్ నందు ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం వారి ప్రేమ పూర్వక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బి.సి రాయ్ 1882 జన్మించారు. డాక్టర్ గా ప్రజలకు అనేక సేవలు అందిస్తూ కలకత్తా మేయర్ గా ఎదిగి వెస్ట్ బెంగాల్ కి సెకండ్ సీఎంగా ఉండి ఆయన వృత్తిని వదలకుండా ప్రజలకు సేవ చేయాలని, ఎంతోకొంత సమయాన్ని ప్రజల కోసం కేటాయించి వైద్యాన్ని అందించేవారు అందువల్ల ఆయన గొప్పవారు అయ్యారు. అలాంటి బీసీ రాయ్ గారి జీవితంలో కూడా ఒక ఇన్స్టంట్ జరిగింది. ఆ రోజుల్లో ఈయన ఎంబిబిఎస్ చేసిన తర్వాత యూకే ఇంగ్లాండులో సెంటు బర్కస్ లో అడ్మిషన్ కోసం ట్రై చేస్తే రిజక్ట్ చేశారు. కేవలం ఇండియన్ అనే వివక్షత కారణంగా కానీ పట్టు వదలకుండా 30 టైమ్స్ అడ్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. ఫైనల్ గా అడ్మిషన్ సాధించారు. ఎం ఆర్ సి పి, ఎఫ్ ఆర్ సి ఎస్ ఫిజీషియన్ అండ్ సర్జన్ చేసి రావడం జరిగింది. అంటే పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదంటూ డాక్టర్ పిల్లా శ్రీధర్ బీసీ రాయ్ గురించి క్లుప్తంగా పిల్లలకు వివరించడం జరిగింది. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు క్లుప్తంగా జవాబులు అందించడం జరిగింది.