వేమగిరి పసుపులమ్మ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: గోకివాడ గ్రామానికి చెందినటువంటి వేమగిరి పసుపులమ్మ అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని అందించడం జరిగింది. అనంతరం వారి కుటుంబ అవసరాల నిమిత్తం బియ్యం బస్తా ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ సర్పంచ్ గరగ సత్యానంద రావు, నామా రాంబాబు, సుందర శ్రీను, నామ తిరుపతయ్య, కొప్పిశెట్టి నాగబాబు, గరగ కొండల రావు, నామ నాగేశ్వరరావు, నామ అశోక్, కాయల పవన్, గరగా చక్రరావు, గరగా వీరబాబు, పిల్లా వీరబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.