మాజీ సర్పంచ్ అడవి రాజు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం: ప్రజా సంక్షేమమే కోరికగా, ప్రజా అభివృద్ధి ప్రాణముగా భావించి అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసి గ్రామ అభివృద్ధికై కృషిచేసిన మంచి వ్యక్తి గ్రామ ప్రజల గుండె చప్పుడై భావితరాలకు ఆదర్శంగా నిలిచిన మహా వ్యక్తి ఉప్పాడ గ్రామం మామిశెట్టిపేట మాజీ సర్పంచ్ ఎరిపిల్లి అడవి రాజు అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని నింపడం జరిగింది. అనంతరం కుటుంబం అవసరాల నిమిత్తం 5000 రూపాయలు అందించడం జరిగింది. ఇలాంటి మంచి వ్యక్తి చనిపోవడం బాధాకరమైన విషయమని మీ కుటుంబంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా ఒక అన్నలా నేను జనసేన కుటుంబంతో మీ ముందు ఉంటానని ఎరిపిల్లి అడవి రాజు కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చిన డాక్టర్ పిల్లా శ్రీధర్. ఈ కార్యక్రమంలో భాగంగా బొందు చిరంజీవి, దాసం కాటుకలు, మైలపల్లి రవి పల్లెటి జాన్సన్, బొంతల వెంకటరావు, పెనుపోతుల వీరబాబు, కోరు కొండబాబు, మైలపల్లి సామేలు, దాసం అప్పన్న, కారే కాసులు, బొందు చిన్న, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.