కందరాడ సత్తెమ్మ తల్లి సంబర మహోత్సవాల్లో డాక్టర్ శ్రీధర్ పిల్లా

  • సంబర మహోత్సవానికి రూపాయలు 20,000/- విరాళం

పిఠాపురం నియోజకవర్గం, కందరాడ గ్రామంలో పూర్వపు వైభవం గత ఆరు, ఏడు సంవత్సరాల కిందట జరిగే సంబరాలను తలపించే విధంగా అంగరంగ వైభవంగా జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా చేతుల మీదుగా తన సొంత స్వగ్రామమైన కందరాడ సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని కమిటీ వారు జనసైనికుల సమక్షంలో డాక్టర్ శ్రీధర్ పిల్లా చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి గరగను ఎత్తి అంగరంగ వైభవంగా సంబరాన్ని ముందుకి నడిపించడం జరిగింది. ఈ సంబర మహోత్సవానికి డాక్టర్ శ్రీధర్ పిల్లా 20,000/- (అక్షరాల ఇరవైవేల రూపాయలు) అందించడం జరిగింది. వారి సహకారంతో యూత్ కమిటీ వారు అద్భుతమైన సంబరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బస్వా చంటిబాబు, పిల్లా వెంకటరమణ అమడగల రామకృష్ణ, అధిక సంఖ్యలో కమిటీ వారు, గ్రామ పెద్దలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.