మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందించిన డాక్టర్ యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు, కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం పంచాయతీ, శుద్ధగుంట గ్రామం నుండి గాజుల కండ్రిగ గ్రామం వరకు గత 35 సంవత్సరాలుగా రోడ్డు సౌకర్యం లేక అనేక అవస్థలకు గురవుతున్నారని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజులకండ్రిగ గ్రామాన్ని గాలికి వదిలేసారని, వైసీపీ ప్రభుత్వం గాలిలో పేక మేడలు కడుతున్నారని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. గ్రామాభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. గాజుల కండ్రిగ గ్రామానికి సిమెంట్ రోడ్డు వేయాలని డిమాండ్ చేసారు. మార్చి 26 వ తేదీ లోపు సిమెంట్ రోడ్డు వేయకపోతే, 27 వ తేదీ నాడు గాజుల కండ్రిగ గ్రామంలోనే ఆమరణ దీక్ష చేస్తానని తెలిపారు. ఈ రాష్ట్రంలో సర్వరంగ సమగ్రాభివృద్ధి సాధనే జనసేన లక్ష్యమని తెలియజేసారు. ఒకసారి పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇవ్వండి, రాయల పాలన తెస్తామని మండల ప్రజలను విజ్ఞప్తి చేసారు. గాజుల కండ్రిగ గ్రామానికి సిమెంట్ రోడ్డు మంజూరు చేయాలనీ మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటినగరం టౌన్ ప్రెసిడెంట్ రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, మండల కార్యదర్శి మణికంఠ ఉన్నారు.