ఫిలింనగర్ కు తక్షణమే త్రాగునీరు అందివ్వాలి: బత్తుల డిమాండ్

  • కుట్ర పూరితంగా ధర్మాని భగ్నం చేయడానికి విఫలయత్నం చేసిన వైసిపి గుండాలు
  • సుమారు 4 గంటలపాటు మహాధర్న
  • శాంతియుతంగానే ధర్నాను కొనసాగించిన జనసేన శ్రేణులు
  • తక్షణమే ఫిలింనగర్ కాలనీకి మంచినీరు మంజూరు చేస్తామని అధికారుల హామి
  • ధర్నాలో పాల్గొన్న సుమారు 200 మంది మహిళలు

రాజానగరం, కోరుకొండ మండల కేంద్రమైన కోరుకొండ గ్రామం ఫిలింనగర్ లో నివాసముంటున్న ఎస్టి సామాజిక వర్గానికి చెందిన సుమారు 200 మంది కూలి పని చేసుకునే జీవనోపాధి కొనసాగిస్తున్న వీరి కాలనీకి గత రెండు నెలలుగా త్రాగునీరు లేక, ముఖ్యంగా ఈ వేసవికాలం కావడంతో త్రాగడానికి మంచినీరు లేక కటకటలాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న కాలనీవాసులు శుక్రవారం కోరుకొండ గ్రామ సచివాలయం వద్ద సంబంధిత అధికారులను నిలదీయగా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా వారి పక్షాన పోరాటానికి జనసేన రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గోని అధికారులను నిలదీస్తూ… రోజుకు కేవలం ఇంటికి ఒక్క బిందె నీళ్లు వస్తున్నాయని, ఒక్కో రోజు అవి కూడా రావట్లేదని, మంచినీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలని వాసులకు తక్షణమే నిత్యం వారికి సరిపడా త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయగా… సంబంధిత పంచాయతీ సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోగా అక్కడకు చేరుకున్న వైసీపీ కార్యకర్తలు కుట్రపూరితంగా కావాలని రెచ్చగొట్టి మహిళలపై దౌర్జన్యానికి దిగగా, వారి కౄర చర్యలను నిరసిస్తూ స్థానిక ఫిలింనగర్ మహిళలు, బత్తుల దంపతులు కోరుకొండ బస్ స్టాప్ వద్ద మహా ధర్నా నిర్వహించి, కాలనీవాసులకు తక్షణం మంచినీరు నిత్యం సరఫరా చేయాలని, అలానే ఎస్టీ మహిళలపై దౌర్జన్యానికి దిగిన వైసిపి కార్యకర్తలను అరెస్టు చేసి శిక్షించాలని న్యాయబద్ధంగా చేస్తున్న ఈ న్యాయ పోరాటాన్ని భగ్నం చేసేందుకు వైసిపి నాయకులు మరొక మారు వివిధ కులాలను రెచ్చగొట్టి ఈ ధర్నాను భగ్నం చేసేందుకు, వైసిపికి చెందిన కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టి కుల రాజకీయం చేయడానికి విఫలయత్నం చేయగా… పరిస్థితిని గమనించిన బత్తుల బలరామకృష్ణ జనసెనశ్రేణులకు సర్ది చెప్పి శాంతియుతంగానే ధర్నా నిర్వహించాలని పిలుపునివ్వగా దానికి అనుగుణంగానే సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ మహాధర్నా కార్యక్రమానికి అధికారులు, వైసిపి నాయకులు, సంబంధిత పంచాయతీ అధికారులు కోరుకొండ మండలం ఎమ్మార్వో, పోలీస్ శాఖ వారు ధర్నా ప్రదేశానికి చేరుకుని తక్షణమే ఫిలింనగర్ కాలనీకి మంచినీరు మంజూరు చేస్తామని, అలానే మహిళలపై దౌర్జన్యానికి దిగిన వైసీపీ కార్యకర్తలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఈ నిరసన విరమించడం జరిగింది. అనంతరం ఫిలింనగర్ వాసులు తమ పక్షాన పోరాడినందుకు బత్తుల బాలరామకృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ కు చెందిన సుమారు 200 మంది మహిళలు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.