కళాశాల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలి: నేమూరి శంకర్ గౌడ్

• సాత్విక్ మరణం బాధాకరం
• ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి.

రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీచైతన్య కళాశాలలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధి ఎన్.సాత్విక్ పట్ల కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా విందు ప్రాణం బలవ్వడం బాధాకరం, రాత్రి 10గంటల 30నిమిషాల సమయంలో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు ఎందుకు వచ్చాయో చెప్పాల్సిన అవసరం ఉంది. కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్లనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నట్టు సహచర విద్యార్ధులు చెప్తున్నారు. విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసి కూడా కళాశాల యాజమాన్యం కాని, సిబ్బంది కాని పట్టించుకోలేదని తెలిసింది. కనీసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సహచర విద్యార్ధులు సాత్విక ను బయటకు తీసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న వాహనాలను సహాయం అడిగి మరీ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏమిటి? అసుపత్రికి తరలించే లోపే సాత్విక మృతి చెందడం శోచనీయం, సాత్విక మృతి పట్ల తల్లిదండ్రులకు సంతాపం తెలుపుతున్నాం. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కళాశాల యాజమాన్యం రూ.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించి, సాత్విక కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలని తెలంగాణా జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ అన్నారు.