జనసేన పోరాటంతో డంపింగ్ యార్డ్ తరలింపు..

విసన్నపేట బస్టాండ్ సమీపంలో దశాబ్దాల కాలం పాటు ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించాలని జనసేన పార్టీ తరఫున కొద్దిరోజులుగా పోరాటం చేస్తున్న విహయం అందరికీ విదితమే. ఈ ఆదివారం కూడా జిల్లా నాయకులు ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, మండల అధ్యక్షులు షేక్ యాసిన్, మండల నాయకులు అధికారులు మీద డంపింగా యార్డ్ గురించి ఘాటుగా విమర్శలు చేసారు. డంపింగ్ యార్డు సమస్యపై విస్సన్నపేట రెవిన్యూ అధికారులు స్పందించారు. ఎట్టకేలకు నూజివీడు రాణి కళ్యాణ మండపం ఎదురుగా రెవెన్యూ వారు చూపిన ప్రభుత్వ స్థలంలో తరలించారు.. ఇకపై గ్రామంలో సేకరించిన చెత్తాచెదారాన్ని బస్టాండ్ వద్ద కాకుండా నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ కు తరలించాలని ఎంపీడీవో ఎస్ వెంకటరమణ గ్రామపంచాయతీ ఈవో బి ఎస్ ఎస్ శ్రీనివాస్ ను ఆదేశించారు. దీంతో గ్రామ ప్రజలు ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి సహకరిచిన ఉమ్మడి కృష్ణ జిల్లా ఉప అధ్యక్షులు బోలియా శెట్టి శ్రీకాంత్ కు మండల అధ్యక్షులు షేక్ యాసీన్, ఉపాధ్యక్షులు తేజ, ఉపాధ్యక్షులు అడపా శ్రీను, ప్రధాకర్యదర్శి మహేష్, ప్రధాకర్యదర్శి కస్తూరి సీతార తదితరులు పాల్గొన్నారు.