Tanuku: దువ్వలో జనసేనలో చేరికలు

తణుకు నియోజకవర్గం తణుకు మండలం దువ్వ గ్రామంలో దువ్వ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీరాముల చిన్ని ఆధ్వర్యంలో పార్టీ సిద్ధాంతాలకు అకర్షితులై పార్టీలో జాయిన్ అయిన గ్రామ సభ్యులు చేట్ల సురేష్, యార్లగడ్డ చిరంజీవి(గని), నూతంగి కిరణ్ మరియు 20 మందిని తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ విడివాడ రామచంద్రరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది. ఈ యొక్క కార్యకమంలో తణుకు పార్టీ మండలం అధ్యక్షులు చిక్కాల వేణుగోపాల్ చంద్రశేఖర్, లీగల్ సెల్ అధ్యక్షులు కొయ్యల విజయ్ మరియు గ్రామ నాయకులు తోట శ్రీను, అంతర్వేది గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.