ఫిబ్రవరి1 నుండి విద్యాసంస్థలు.. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి..

ఫిబ్రవరి ఒకటి నుండి తెలంగాణలో ప్రారంభం కానున్నాయి విద్యాసంస్థలు. ఈ నేపథ్యంలో హాస్టల్స్, గురుకుల విద్యాలయాల ఓపెన్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ ఆదేశాలు పాటించాలని సంక్షేమ శాఖలకు తెలిపామని… ఈ నెల 25 లోపు అన్ని విధాలుగా సిద్ధం కావాలని చెప్పామన్నారు. విద్యార్థికి, విద్యార్థికి మధ్య 6 ఫీట్స్ దూరం పాటించాలని… హాస్టల్స్ లో ఇంకా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సంక్షేమ శాఖల కు చెప్పాము. హాస్టల్స్ లో వైద్య సిబ్బంది ని అందుబాటులో ఉంచాలి. టెక్స్ట్ బుక్స్ రీచ్ అయ్యాయ లేదా చూడాలని చెప్పాము అని పేర్కొన్నారు. కరోనా నిబంధనలు టీచర్స్ తప్పకుండా పాటించాలి. ట్యూషన్ ఫీ తప్ప ఇతర ఏ ఫీజులు తీసుకోవద్దని ప్రైవేట్ యాజమాన్యాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాము.. సహకరించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్న అని అన్నారు. ఫీజుల ఇష్యూ ఉండొద్దనే పరిక్షలకు హాజరు శాతం నిబంధనను ఈ సారి తొలగించాం.. స్కూల్స్ లో శానిటేషన్ విషయంలో లోకల్ బాడీలను ఇన్వాల్వ్ చేయాలని సీఎం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాడు. రేపు పేరెంట్స్ అసోసియేషన్ తో సమావేశం ఉంది.. వారు కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పిల్లలను పాఠశాలలకు పంపించాలి అని అన్నారు.