Madira: నియోజకవర్గ విద్యార్ధి విభాగ కమిటీల ఎన్నిక

మధిర నియోజకవర్గం బోనకల్ మండల కేంద్రంలో జనసేన పార్టీ తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీ సంపత్ నాయక్, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ మిరియాల రామకృష్ణ, విద్యార్థి విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కొండా పవన్, శ్రీ బండి నరేష్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాలేజీలో విద్యార్థి విభాగం నుంచి కోఆర్డినేటర్, కార్యనిర్వహక సభ్యులు, కాలేజిలో విద్యార్థి విభాగం కమిటీలు వేసి ఎన్నిక చేయాలని మాకు బాధ్యత అప్పజెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మధిర నియోజకవర్గం బోనకల్ మండల కేంద్రంలో గవర్నమెంట్ కాలేజీలో జనసేన పార్టీ మధిర నియోజకవర్గం విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యుడుగా శ్రీ గంధం ఆనంద్ అధ్యక్షతన విద్యార్థులకు కాలేజ్ నుండి విద్యార్థి విభాగం నుంచి కోఆర్డినేటర్ గా కార్యనిర్వహక సభ్యులుగా కమిటీలు వేసి ఎన్నిక చేయటం జరగింది. ఈ కార్యక్రమంలో బాగంగా జనసేన పార్టీ మధిర నియోజకవర్గం సభ్యులు శ్రీ తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ విద్యార్థి విభాగం నుంచి పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ మండల నాయకులు ఎస్ కె జానీ పాషా, సాయి కుమార్, అఫ్జల్, కోసూరి అశోక్, షేక్ బాజీ బాబా మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.