డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన ఏలూరు జనసేన

దళితులకు వెనుకబడిన వర్గాలకు సమాన హక్కుల కోసం పాటుపడిన వ్యక్తి,భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ భీం రావ్ అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా.. జనసేన పార్టీ ఏలూరు కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తి ఈ రోజున భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది ప్రజలు.. వారు ఇచ్చిన రాయితీలు, చూపిన మార్గదర్శకాలు రాజ్యాంగం ద్వారానే పొందుతున్నారు.. ఈ పరిస్థితుల్లో వారి ఆశయాలను స్మరించుకుంటూ.. నిరంతరం వారి భావాలను అలవర్చుకుంటూ.. రాబోయే తరానికి వారి ఆశయాలను, వారి మార్గాలను అందించే బాధ్యత మనందరిపై ఉంది. ప్రపంచ దేశంలోనే భారతదేశం అతి బలమైన రాజ్యాంగ వ్యవస్థ నెలకొల్పి ఉంది. నేడు రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకించాలి.. ప్రజలను చైతన్య పరచాలి.. ప్రజలకు రాజ్యాంగం పట్ల అవగాహన కల్పిస్తూ.. మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే శక్తివంతమైన చైతన్యం అందించే దిశగా.. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను దీనికి జోడించి రాబోయే తరానికి ఈ నవసమాజ నిర్మాణంలో భాగంగా.. అందరం కూడా భాగస్వాములు కావాలని, అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే జనసేన పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ కలెక్టర్ ఎట్రించి ధర్మేంద్ర, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు గొడవర్తి నవీన్, అగ్గాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.