నవ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్: కౌన్సిలర్ విజయలక్ష్మి

కోనసీమజిల్లా, నవ రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, దేశ సమగ్రత, సమైక్యత కు పాటుపడ్డారని అమలాపురం పురపాలక సంఘ 9వ వార్డు కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి వాసు అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ 131వ జయంతిసందర్భంగా 9వార్డు పరిధిలో సాయంపేట, నల్లా గార్డెన్స్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కౌన్సిలర్ విజయలక్ష్మి వాసు మాట్లాడుతూ దేశం కోసం ఆయనచేసిన సేవలు చిరస్మరణీయమని, అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన మహానీయుడు అన్నారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు తీసుకువచ్చి, దళితులకు అండగా నిలిచారన్నారు. దళిత, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం, ఆయన ఆశయాలు, మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అంబేద్కర్ అంటే ఒక పేరు కాదని అది మనలను నడిపించే శక్తి అన్నారు. ఈ కార్య క్రమాల్లో నల్లా చిన్ని, నల్లా సత్యనారాయణ, నూకల షణ్ముఖరావు, నల్లా కృష్ణ, నల్లా మణికంఠ, గొలకోటి వాసు, కె.వెంకటేశ్వరావు, కోన గణేష్, కోన మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.