జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఏలూరు జనసేన

భారతదేశ ప్రధమ సామాజిక తత్వవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 195 వ జయంతి సందర్భంగా.. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. సత్యశోధక సమాజాన్ని స్థాపించి భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కరణోద్యమం చేసిన జ్యోతి రావు పూలే గారు.. దుర్మార్గమైన కుల వ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని దేశంలోనే కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శినికుడు, గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన రాజనాలందుకున్నాడు.

సామాజిక ప్రజాస్వామ్యం సాధించడం భారత దేశానికి ముఖ్యమనే సందేశాన్ని అందించినందుకు తన గురువుగా డా.బి.ఆర్. అంబేడ్కర్ గారు ప్రకటించుకున్న మహోన్నత వ్యక్తి “మహాత్మా జ్యోతిరావు పూలే” 195 వ జయంతి సందర్భంగా ఆ మహనీయున్ని స్మరించుకుంటూ.. ఆయన ఆశయాలు సాధనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ.. ఆయనకు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుండి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బోండా రాము, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు గోడవర్తి నవీన్, జనపరెడ్డి తేజ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.