నేటి నుంచి యూకే లో ఎమర్జెన్సీ లాక్‌డౌన్

క్రిస్మస్ వేడుకల కోసం సిద్ధమైన యూకే ప్రజలకు నిరాశ ఎదురైంది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ క్రిస్మస్‌ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోవాలని లక్షలాది మంది యూకే ప్రజలు రెడీ అయ్యారు. కానీ, అనుకున్నది ఒకటి అయిందొకటి. కరోనా వైరస్‌లో కొత్త రకం విజృంభిస్తోంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా యూకే ప్రభుత్వం కఠిన ఆంక్షలను నేటి (డిసెంబర్ 20) నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. లండన్ అత్యవసర లౌక్ డౌన్ లోకి వెళ్లిపోతోంది. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త జాతిని నియంత్రించడానికి లండన్, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో నేటి నుండి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.