జనసైనికుడు కుటుంబానికి శ్రీమతి వినుత కోటా ఆర్థిక సహాయం

శ్రీకాళహస్తి పట్టణంలో పేద కుటుంబానికి చెందిన జనసైనికుడు బాలాజీ అవ్వ ఇటీవల మరణించారు. మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా నాయకులు, వీరమహిళలతో వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 8,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జనసైనికులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వినుత బరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, నాయకులు లక్ష్మి, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, కావలి శివకుమార్, రాజ్య లక్ష్మి, పేట చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.