జర్నలిస్టుల కాలనీలో ఆక్రమణలు తొలగించాలి: గురాన అయ్యలు

  • కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టులు నిరసన దీక్షకు “జనసేన పార్టీ” సంఘీభావం..

విజయనగరం: కేఎల్‌ పురంలో జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఆక్రమణలు తొలగించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావంగా జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు, త్యాడ రామకృష్ణారావు(బాలు) దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. జనసేన నాయకులు గురాన అయ్యలు మాట్లాడుతూ.. కెఎల్‌ పురంలో ఉన్న జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో బయట వారు వచ్చి ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు న్యాయం చేయకపోగా వారికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించు కోవడానికి రెవెన్యూ అధికారులు సహాయ పడటం అన్యాయమన్నారు. అనేక ఏళ్లుగా వృత్తిని నమ్ముకొని ఉన్న జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు కేటాయించాలని, ఎవరైతే ఆక్రమణలు చేశారో వాటిని తొలగించి, అర్హులైన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమండ్ చేశారు. జర్నలిస్ట్ లు చేసే ఈ పోరాటానికి జనసేన పార్టీ తరుపున ఏటువంటి పోరాటానికైనా సిద్దమని తెలిపారు.