జనసేనలో చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోదవరం, చింతూరు మండలం చిడుమూరు పంచాయతీ బుర్కాన కోట గ్రామం కుంజ, రమేష్, కుంజ భద్రయ్య, కారం కాంతారావు ఆధ్వర్యంలో 30 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరికలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు మడివి రాజు పాల్గొని నూతనంగా వచ్చినటువంటి జనసైనికులను సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మడివి రాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని అందరు కూడా సోదర భావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు బేడే సతీష్, తీగల రవి, కారం దుర్గారావు, పొడియం నాగర్జున, ఉయిక వెంకటేష్ కొవ్వాసి బాబురావు తదితరులు పాల్గొన్నారు.