పర్యావరణ పరిరక్షణ జనసేన మూల సిద్ధాంతం: గురాన అయ్యలు

విజయనగరం: జనసేన సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్దాంతం పర్యావరణ పరిరక్షణ అని, ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటుందని, సమాజం బాగుండాలంటే ప్రజలందరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు.
జనసేన అదినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా విజయనగరం పట్టణంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం పట్టణంలో పేర్ల వారి వీధిలో చెవిటి మూగ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు, బిస్కెట్ పాకెట్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ జనసేన అదినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసైనికులు ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, సమాజంలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని, అతను సమాజం కోసం ఎన్నో మంచి పనులు చేశారని, నిరంతం ప్రజల మంచి కోసం ఆలోచించే వ్యక్తి అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆలాగే ప్రజల కోసం మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రజలకు మరింత సేవచేసే భాగ్యం పవన్ కళ్యాణ్ కి త్వరలోనే వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టి.రామకృష్ణ, కాటం అశ్విని, రాజేంద్ర, రవితేజ, పిడుగు సతీష్, రవీంద్ర, ముదిలి శ్రీనివాసరావు, జె. మోహన్ రావు, వజ్రపు నవీన్, పవన్ కుమార్, అభిలాష్, గొల్లపల్లి మహేష్, సురేష్ కుమార్, భార్గవ్, అడబాల వేంకటేష్, సాయి, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.