జనసేనాని దృష్టికి ఎర్రవరం పవర్ ప్రాజెక్ట్ సమస్యలు

పాడేరు నియోజకవర్గం: జనసేన అధినేత వారాహి యాత్ర విశాఖపట్నంలో జనసందోహంతో సాగుతోంది గురువారం దశపల్ల హోటల్ ప్రాంగణంలో నిర్వహించిన జనవాణీ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అనేక సమస్యలు మీద పవన్ కళ్యాణ్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా పాడేరు నియోజకవర్గం నుంచి చింతపల్లి మండలం ఎర్రవరం పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం గిరిజన ప్రజామోదం లేకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, అనుమతులు లేకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో వ్యవహరించే విధానాన్ని అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూవస్తున్నారు. ఈ జనవాణీ కార్యక్రమంలో జనసేనాని దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లే విధంగా చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, స్థానిక ఎర్రవరం జనసైనికుడు గూడెపు వేణుగోపాల్ రావు వారి చేత వినతి పత్రం రూపంలో జనవాణి కార్యక్రమంలో అధినేత పవన్ కళ్యాణ్ గారికి అందించారు. అందుకు స్పందించిన అధినేత తప్పకుండా ఈ అంశాలపై పూర్వాపరాలు తెలుసుకుని స్పందిస్తామని అన్నారు. జనవాణి కార్యక్రమంలో ఎర్రవరం గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి స్థానిక ప్రజలు ఒక బృందంగా ఏర్పడి ఎలాగైనా మా గోడు పట్టించుకునే నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రమేనని నమ్మకంతో వచ్చామని అతనితో మా సమస్య చెప్పుకుంటే తీరుతుందేమోనని ఆశతో వచ్చిన మాకు అతని మాటతో గొప్ప మానసికబలం లభించందని అన్నారు. ఎర్రవరం పరిసర గ్రామస్తులు మాట్లాడుతూ మా సమస్యలపై నియోజకవర్గంలో సత్వరమే స్పందించే నాయకులు మా ఇన్చార్జ్ వంపూరు గంగులయ్య అలాగే చింతపల్లి మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, గూడెపు వేణుగోపాలరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.