వైసీపీ ప్రభుత్వంలో దేవుడి మాన్య భూములకు కూడా రక్షణ లేకుండా పోతోంది.. ధ్వజమెత్తిన గోరంట్ల జనసేన

  • దేవుడి మాన్య భూములను కాపాడండి.. గోరంట్ల జనసేన డిమాండ్

పెనుకొండ నియోజకవర్గం: గోరంట్ల మండలం, బూదిలి గ్రామంలోని పొలంలో సర్వే నెంబర్ 531 లో కోటిలింగేశ్వర స్వామి ఆలయమాన్యం భూమి 4ఎకరాల, 9సెంట్లును కొందరు అధికార పార్టీ నాయకులు కబ్జాకు ప్రయత్నించారనే వార్త పత్రికలలో, న్యూస్ ఛానెల్స్ లో చూసిన గోరంట్ల జనసేన నాయకులు కబ్జాకు కాబడిన భూమిని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సందర్శించి, వివరాలు కనుక్కుని వారికి భరోసా ఇచ్చి, స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. పెనుకొండ నియోజకవర్గంలో భూ దోపిడీలు ఎక్కువ అయ్యాయి అని , ఎక్కడ సెంటు భూమి కనపడినా వాటిని అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని, వారికి అడ్డు అదుపు లేకుండా పోతుందని విమర్శించారు. భూదిలిలో కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షములో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, మండల అధ్యక్షుడు సంతోష్, నాయకులు అనిల్ కుమార్, నాగేంద్ర, నరేశ్, బాబర్, తిరుపల్, నాగేష్, శ్రీనివాసులు, రమణ, గంగరాజు, బాబావలి, రమేష్, వేణు, రాజేంద్ర, ఆంజనేయులు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.