సమస్యల పరిష్కారానికి జనసేన కృషి చేస్తుంది

  • పంచాయతీ ఎన్నికల ప్రచారంలో రాటాల వెంకటసుబ్బమ్మ

సిద్ధవటం: సిద్ధవటం మండలం, ఉప్పరపల్లె గ్రామపంచాయతీ 10వ వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న రాటాల వెంకటసుబ్బమ్మ ఎస్సీ కాలనీలో గడపగడప తిరుగుతూ స్టూల్ గుర్తుకు ఓటు వేయమని ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యంగా విద్యుత్ దీపాలు, మంచి నీటి సమస్య కొరత ఉందని సమస్యలు తీసుకొచ్చారని సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ నా విజయానికి కృషి చేయాలని రాటాల వెంకటసుబ్బమ్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాటాల రామయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు కొట్టే రాజేష్, పసుపులేటి కళ్యాణ్, నారా కిషోర్, వీరయ్య ఆచారి, హేమంత్, వీరమహిళలు పాల్గొన్నారు.