రైతు భరోసానా? లేక వైసీపీ నాయకులకు భరోసానా?

కొండపి నియోజకవర్గం: రైతు భరోసా నిధులు ఎక్కడ?, ఎవరి జేబులు నింపుకున్నారు? అధికారులు మరియు వైసీపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ప్రశ్నించారు. పొన్నలూరు మండలంలో ఎం.ఆర్.ఓ కార్యాలయం దగ్గర రైతు భరోసా కేంద్రాన్ని ఆదివారం పొన్నలూరు మండలం జనసేన నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా కనపర్తి మనోజ్ కుమార్ మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే ఈ వైసీపీ ప్రభుత్వం కేవలం మాటలు ప్రభుత్వం మాత్రమే, చేతల ప్రభుత్వం కాదు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం, లక్షల్లో నిధులు స్వాహా చేసిన పొన్నలూరు మండలం వైసిపి నాయకులు మరియు అధికారులు, ఇప్పటివరకు ఈ రైతు భరోసా కేంద్రానికి వచ్చిన నిధులు ఎంత? మీరు చేసిన పనులు ఎంత? ఎందుకు నిర్మించలేకపోతున్నారు? నిధులు ఎవరు జేబులోకి పోయాయి? వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలి, అసలు ఈ కట్టడం రైతు భరోసా కేంద్రమా? లేక దాని నుండి వచ్చే నిధులు స్వాహా చేసే వైసీపీ నాయకులకు భరోసాన్ని ఇచ్చే కేంద్రమా?, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించి, ప్రజలకు మరియు రైతులకు అన్ని విధాలుగా సేవలు అందించాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్ బాషా, కార్యదర్శి మెండ భానుచందర్, కార్యదర్శి నూకల లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి నామతోటి అనిల్, సంయుక్త కార్యదర్శి మహేష్, సంయుక్త కార్యదర్శి హజరతయ్యా, నవీన్, రామరాజు, ప్రసాద్, నందకిషోర్, పవన్ కళ్యాణ్, బ్రహ్మయ్య, రామకృష్ణ, నాని, డి ఎస్ దత్తు, మల్లికార్జున, చెన్నయ్య మరియు జనసైనికులు పాల్గొన్నారు.