సత్తెనపల్లి నియోజకవర్గంలో బొర్రా ఆధ్వర్యంలో వీరమహిళా సదస్సు

  • ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి రజిని, కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ పార్వతి నాయుడు

సత్తెనపల్లి నియోజకవర్గం: దశాబ్దాలుగా పార్లమెంటులో కునారిల్లుతున్న మహిళా బిల్లు ఎట్టకేలకు ఆమోదం పొందడం హర్షదాయకమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కన్నా రజని అన్నారు. ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గంలో బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు అధ్యక్షతన జరిగిన మహిళా సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సభలో పాల్గొన్న మరో అతిధి క్రిష్ణా-పెన్నా మహిళా రీజనల్ కో-ఆర్డినేటర్ పార్వతీనాయుడు మాట్లాడుతూ చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాలన్న లక్ష్యంతో, మహిళా సాధికారతకు పట్టం కట్టాలన్న తలంపుతో ఎందరో చేసిన పోరాటాలు ఈనాటికి ఫలప్రదమవ్వడం సంతోషదాయకం. మరో అతిధి పాకనాటి రమాదేవి మాట్లాడుతూ ఇప్పటికైనా అన్ని రాజకీయపార్టీల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని, ప్రాధాన్యతను పెంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రస్తుత నాయకుల కుటుంబ సభ్యులకు ప్రాధాన్యతనిచ్చి మహిళా బిల్లు మూల లక్ష్యాన్ని దెబ్బదీయకుండా, రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న మహిళల్ని ప్రోత్సహించడంతో పాటు, రాజకీయాల్లోకి రావడానికి మహిళలు ఆసక్తి చూపేలా అన్ని రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. బిల్లు ఆమోదం పొందడానికి కృషి చేసి, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక సభలో పాల్గొన్న జనసేన వీరమహిళలు తమ సత్తాని చాటి, నారీ శక్తిని ఉపయోగించి వైసిపి రాక్షస పాలనను అంతమొందించి ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామన్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకు విశ్రమించమని సదస్సు ప్రతిన బూనింది. మహిళా బిల్లు సందర్భంగా మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, జిల్లా పార్టీ కార్యదర్శి నిశ్శంకర్రావ్ శ్రీనివాసరావు, సం యుక్త కార్యదర్శి అంపిరాయని కళ్యాణ రాజేశ్వరి, మండల పార్టీ అధ్యక్షులు, తోట నర్సయ్య, తాడువాయి లక్ష్మి, నాదెండ్ల నాగేశ్వరరావు, కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, జిల్లా కార్యవర్గ సభ్యులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా నాయకులను, సత్తెనపల్లి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన మహిళల్ని సత్కరించారు.