అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి, ఉగాది సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు, వాటిలో ముందుగా భోగాపురం మండలంలో ముక్కం గ్రామ పంచాయతీలోని జాతర సందర్భంగా ఆ ఊరి గ్రామ దేవత అయిన కొత్తనూకాలమ్మ వారికి పట్టువస్త్రములు, పసుపుకుంకుమలు సమర్పించి గ్రామంలో గడప గడపకి తిరిగి వచ్చే ఎన్నికల్లో జనసేనకి మద్దతు తెలపాలని లోకం మాధవి కోరారు. ఈ కార్యక్రమంలో జాతర సందర్భంగా వైజాగ్ లో నివసిస్తున్న జనసైనికులు మరియు జనసేన నాయకులు అయిన బడే రామారావు, వాసుపల్లి దాసు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
తదుపరి కార్యక్రమం లో భాగంగా శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా నెల్లిమర్ల మండలం, అల్తిపాలెం గ్రామస్తులతో కలసి పంచాంగ శ్రవణం విని గ్రామస్థులతో ముచ్చటించారు. అనంతరం అకాల వర్షాల కారణంగా నష్టపోయిన జొన్న రైతులను ఆదుకోవాలని జనసేన నాయకురాలు లోకం మాధవి డిమాండ్ చేసారు. విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం, నెల్లిమర్ల మండలం.. సతివాడ , జోగిరాజు పేట, అల్తి పాలెం గ్రామం, మరియు పరిసర గ్రామాల్లో అకాల వర్షాలు వలన తీవ్రంగా మొక్కజొన్న, టొమాటో పంటలు పూర్తిగా నష్టపోయిన ప్రాంతాల్లో రైతులను జనసేన పార్టీ నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి బుధవారం మధ్యాహ్నం పరామర్శించారు. జనసేన నాయకురాలు లోకం మాధవి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న పంటకోసం అప్పుచేసి ఏకరాకు సుమారు యాబై వేలు ఖర్చుచేసారని, ఒక్క నెల్లిమర్ల మండలంలోనే సుమారు వంద ఎకరాలు మొక్కజొన్న, టొమాటో పంటలు దెబ్బతిన్నాయని, వీరికి న్యాయం జరిగే వరకూ జనసేన పార్టీ తరుపున అండగా నిలుస్తామని, ఎకరాకు ఏబైవేలు రూపాయలు జనసేన తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రైతే దేశానికి, రాష్ట్రానికి వెన్నుముక అని చట్టసభల్లో ప్రగల్భాలు పలికే ఈ వైసీపి నాయకులకు ఈ రైతు బాధలు కనబడట్లేదా అని దుయ్యబట్టారు. ఈ అకాల వర్షాలు పడి రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యవసాయ అధికారులు,ప్రజా ప్రతినిధిలు పరామర్శ చేయక పోవడం భాధాకరమని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే వరకు జనసేన పార్టీ తరుపున అండగా నిలిచి, పోరాడతామని తెలిపారు.