తిరువూరు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు

తిరువూరు: జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామరైతులను శనివారం రాత్రి ఘనంగా సత్కరించిన జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు చింతలపాటి వెంకటకృష్ణారావు, గాదె వారి గూడెం సర్పంచ్ చెన్నా శ్రీనివాసరావు, తిరువూరు నాయకులు ఉయ్యూరు జయప్రకాష్, అడ్వకేట్ లింగినేని సుధాకర్.. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రపంచానికి అన్నం పెడుతున్నారని అలాంటి రైతులను ఈరోజు సత్కరించుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రానున్న జనసేన తెలుగుదేశం ప్రజా ప్రభుత్వం రైతులకు మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోబోతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ గ్రామ కమిటీల గురించి, బూత్ లెవెల్ కమిటీల గురించి జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత తొందరగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని మండల అధ్యక్షులకు సూచించారు. పదివేల రైతు భరోసా కేంద్రాల నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం వద్ద 2,300 కోట్లు నిధులు తీసుకున్న వైసీపీ ప్రభుత్వం కేవలం 156 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఇప్పటికీ చాలా గ్రామాల్లో అద్దె భవనాల్లోనే రైతు భరోసా కేంద్రాలు నిర్వహిస్తున్నారని, అద్దె భవనాలకు సరిగా అది కూడా చెల్లించడం లేదని, దళారీలకు లబ్ధి చేకూర్చడం కోసమే రైతు భరోసా కేంద్రాలను తెరపైకి తెచ్చి వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులను దారి మళ్ళించారని ఆయన అన్నారు.. ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సమన్వయంతో పనిచేస్తూ ఓటు బదిలీ అయ్యేవిధంగా పనిచేయాలని కేడర్ కు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆర్లపాడు గ్రామానికి చెందిన రైతులు పసుపులేటి సుబ్బారావు, శ్రీమతి దండేల రాఘవమ్మ, కొంకి హరికృష్ణ, రాఘవరపు రాధాకృష్ణ, వేపూరి రాంబాబు, శావా వెంకటేశ్వరరావు, కుసుమరాజు వెంకటాద్రి, తదితర రైతులను జనసేన నాయకులు దశ్శాలువాతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పసుపులేటి మాధవరావు, దండేల తిరుపతిరావు, వట్టికొండ కృష్ణ, పసుపులేటి రవీంద్ర, షేక్ నాగూర్, జరబల రామకృష్ణ, గ్యాంగ్, ఆర్లపాడు గ్రామ జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.