భయమా.. జాగ్రత్తనా..!

  • విపక్ష నేతల ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలపై తెలంగాణలో ఊపిరిపోసుకుంటున్న కొత్త రాజకీయం
  • భైంసాలో పోలీసు అదుపులో వున్న జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు ఎం.అర్.పి.ఎస్ జిల్లా నాయకులు బర్ల రాజ్ కుమార్

భైంసా: అధికార పార్టీ నేతల పర్యటన సందర్భంగా విపక్షాలకు చెందిన నాయకులు, ముఖ్య కార్యకర్తలను ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలు చేయడాన్ని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. నిర్మల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన సందర్భంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రశ్నించే గొంతులను అణగదొక్కాలని చూస్తే ఉరుకొనే ప్రసక్తే లేదని వారు ప్రతిఘటిస్తూ ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణలో అభివృద్ధి చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, కార్మికులకు కనీస వేతనం, బిసి లకు రుణాలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులను అరికట్టలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, రేషన్ కార్డులు, కొత్త పించన్లు, వికలాంగులకు పెన్షన్ పదివేలకు పెంచాలని, డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని అరెస్టులు చేసిన ప్రజా సంక్షేమం కోసం ఎల్లప్పుడు పోరాటాలు కొనసాగిస్తామని మహేష్ బాబు తెలియజేసారు.