సినీ నటుడు బాలకృష్ణ దేవాంగ జాతికి క్షమాపణ చెప్పాలి: ఎం. హనుమన్

విజయవాడ: సినీ నటుడు బాలకృష్ణ దేవంగ కులాన్ని హేళన చేసి మాట్లాడడం పద్ధతి కాదని, దానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని న్యాయవాది మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రెటరీ ఎం. హనుమన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త మానవుల నాగరికత చిహ్నమైన వస్త్రాలు సమకూర్చుటకై శివుని పాలనేత్రం నుంచి ఉద్భవించిన దేవంగ జాతి మూలపురుషుడు స్త్రీ దేవలమహర్షి గురించి రాక్షస జాతి అంటూ, సినీనటి బాలకృష్ణ హేళన చేశారు. ఈ విషయంగా చేనేత కార్మికులు, చేనేత సంఘాల లక్షలాదిమంది మనోభావాలు దెబ్బతీసాయి దీనిపై స్పందించి తక్షణమే బాలకృష్ణ దేవాంగ జాతికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చేనేత కార్మికులు నేసే వస్త్రాలు ధరించి, వాళ్లను హేళన చేసిన బాలకృష్ణకి తగిన రీతిలో సమాధానం చెప్పాలని దేవాంగ సంఘాలను హనుమన్ కోరారు.