పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

జనగామ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది వెంకట నారాయణ గౌడ్ మనవడు, పెద్ది నవీన్ గౌడ్ కుమారుడు, పెద్ది ఆర్య పుట్టినరోజు సందర్బంగా వర్ధన్ ఆనాధ, అతిధి గురుకుల ఆశ్రమంలొ ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించండి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనగామకు చెందిన వేమల్ల అభిలాష్ రెడ్డి, మణిదీప్, వినోద్, అశోక్, శశి, మణిరాజ్ పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా వారి అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. చిన్నారులకు అన్నదానం పండ్లు పెన్నులు బిస్కెట్లు పంపిణీ జరిగింది. చిన్నారుల మద్య అన్నదానం చేయడం అలాగే పండ్లు పంపిణీ కార్యక్రమం జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాధ ఆశ్రమంలో అన్నదానం పండ్లు పంపిణీ చేసారు. వేమల్ల అభిలాష్ మాట్లాడుతూ చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, రంజిత్, శివ, గుజ్జుల నాలిన్, జోగు ఉదయ్, రోహిత్, దిలీప్, వసీం అక్రమ్, సాయి, నామాల సిద్ధులు గౌడ్, మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.