నారాకోడూరు గ్రామంలో “నా సేన కోసం – నా వంతు”

పొన్నూరు నియోజకవర్గం, చేబ్రోలు మండలం, నారాకోడూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ చేబ్రోలు మండల కార్యదర్శి శ్రీమతి ఏలుపూరి లక్ష్మి గృహంలో నేడు “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమంలో భాగంగా సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది ఈసందర్భంగా శ్రీమతి లక్ష్మి ఆధ్వర్యంలో కార్యకర్తలు పార్టీ ప్రకటించిన “నాసేనకోసం – నావంతు” కు తమ వంతు సహకారాన్ని అందించినారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ… గ్రామములో రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలం మరింతగా పుంజుకోవాలని సుశిక్షితులైన కార్యకర్తలను తయారుచేయాలని అందుకోసం చేబ్రోలు మండల కమిటీ ఆధ్యక్షులు మరియు కమిటి సభ్యులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని మార్కండేయ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా కార్యదర్శి మేకల రామయ్య యాదవ్, చేబ్రోలు మండల అధ్యక్షుడు చందు శ్రీరాములు, చేబ్రోలు మండల ఉపాధ్యక్షుడు నారిశెట్టి కృష్ణ, స్థానిక నాయకులు ఏలుపూరి బాలయ్య యాదవ్, పాలడుగు రాంబాబు చౌదరి, గుంటూరు బాజి, దొడ్డా వినయ్ తదితరులు పాల్గొన్నారు.