పెనుమూరు మండలంలో ‘నా సేన కోసం నా వంతు’

  • రాజకీయప్రక్షాళనలో భాగమే జనసేన ఆవిర్భావం
  • పవన్ రావాలి పాలన మారాలి
  • రాజకీయ వ్యవస్థలో ప్రజలు భాగస్వాములు కావాలి
  • అందుకు ప్రాతిపదికే క్రౌడ్ ఫండింగ్
  • మండల ప్రజలకు విజ్ఞప్తి చేసిన జనసేన ఇంచార్జి డా యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలంలో నా సేన కోసం నా వంతు ప్రజలకు అండగా ఉండే జనసేన కోసం ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డా యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ ప్రక్షాళన కోసమే జనసేన పార్టీ ఆవిర్భావించిందని ఉద్భోదించారు. పవన్ రావాలి పాలన మారాలని తెలిపారు. అప్పుడే వ్యవస్థలో కూడా మార్పులు సంభవిస్తాయని తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం అంతిమ అధికారం ప్రజల చేతుల్లోకి ఇవ్వడమేనని తెలియజేసారు. రాజకీయ వ్యవస్థలో ప్రజలు భాగస్వాములు కావాలని, అప్పుడే రాజకీయ పార్టీ జవాబు దారితనం, పారదర్శకతతో పాలన అందిస్తుందని తెలిపారు. అందుకు క్రౌడ్ ఫండింగ్ కూడా దోహద పడుతుందని, మండలంలోని ప్రజలు పవన్ కళ్యాణ్ అందిస్తున్న చిరస్మరణీయ సేవలకు గాను పది రూపాయల నుండి ఎంతైనా 7288040505, 7288040505@UPI నెంబర్ కి ఫోన్ పే, గూగుల్ పే, పే టియం ద్వారా పంపగలరని ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బాలాజీ, జనసైనికులు పాల్గొన్నారు.