పలమనేరు జనసేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ స్టూడెంట్ వింగ్ ఏర్పాటు

పలమనేరు నియోజకవర్గం పరిధిలో ఉన్న వివిధ కళాశాలల విద్యార్థులు పలమనేరు నియోజకవర్గం సీనియర్ నాయకులు సందీప్ రాయల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీపై మక్కువతో మరియు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీ విభాగాలలో భాగమైన భగత్ సింగ్ స్టూడెంట్ వింగ్ ను స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ ను ఉద్దేశిస్తూ తరుణ్ మరియు సూరజ్ లు మాట్లాడుతూ స్టూడెంట్స్ కు ఎటువంటి సమస్యలు ఉన్నా ముందుండి మేము పరిష్కరిస్తామని తెలియచేశారు. అలాగే స్టూడెంట్స్ తరుపున వసంత్ కుమార్ అను జనసైనికుడు స్టూడెంట్స్ తరుపున అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలమనేరు నియోజకవర్గం సీనియర్ నాయకులు సందీప్ రాయల్, పలమనేరు రూరల్ మండలం అధ్యక్షులు నాగరాజు మోతుకూరు, నియోజకవర్గ సీనియర్ నాయకులు జిల్లేడు అరుణ్ రాయల్, రాజశేఖర్, శ్రీనివాసులు, వసంత్ కుమార్, గంగవరం మండలం సీనియర్ నాయకులు వినోద్, అస్లామ్, సూరజ్, పాకాల ప్రదీప్ కుమార్, హ్యూమన్ రైట్స్ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అక్బర్, తరుణ్, శివరాజ్, ప్రవీణ్, వెంకటేష్, భానుప్రసాద్, సుబ్బు, కార్తిక్, పవన్, శ్రీన, సాబీర్, అలీం, యాకూబ్, షన్న, మదు, శక్లైన్ మరియు ఆధిల్ తదితరులు పాల్గొన్నారు.