కొడవటిపూడి గ్రామంలో జనసేన పార్టీ జెండా స్థూపం శంకుస్థాపన

పాయకరావుపేట నియోజకవర్గం, కోటవురట్ల మండలం కొడవటిపూడి గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలకు జనసేన పార్టీ కార్యకర్తలకు, జనసైనికులకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొడవటిపూడి గ్రామంలో బాలేపల్లి ఏసుబాబు ఆధ్వర్యంలో విజయ దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో జనసేన పార్టీ జెండా స్థూపం శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామ జనసేన పార్టీ కార్యకర్తలతో చర్చించి జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ ఎప్పుడు అనేది నియోజకవర్గం పెద్దలతో మాట్లాడి త్వరలో తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బగుడు శ్రీను, బాలేపల్లి మర్నియ్య, నాగేశ్వర రావు, సీతల రాజు, డి.గోపి, జె.చంటి, ఎన్.చంటి, ఎం.ఏసు, బి.గోవిందు, పి.శ్రీను, బి.గణేష్, దుబాయి గోవిందు మరియు జనసేనపార్టీ కార్యకర్తలు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.