జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం, బల్లిపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్ ఆర్థిక సాయంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిర కార్యక్రమంలో అవసరమైన వారికి ఉచితంగా మందులు కళ్ళజోళ్ళు దాసం ప్రసాద్ ఆర్థిక సాయంతో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బల్లిపాడు జనసేన పార్టీ నాయకులు తోట గణేష్, గారపాటి జగదీష్, సింగంశెట్టి కాళీకృష్ణ, కసిరెడ్డి అప్పారావు, ఆకుల రామచంద్రరావు, ఆకుల ఉమామహేశ్వరరావు, ప్రకట గణేష్, ప్రకట శ్రీనివాసు, శంకు కుసుమకుమారి, దాసం శ్రీనివాస్ మరియు జనసైనికులు అందరూ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.