ఘనంగా రావుల మధు జన్మదిన వేడుకలు

రామగుండం, జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన అధ్యక్షులు రావుల మధు జన్మదిన వేడుకలు అమ్మ పరివార్ ఆశ్రమంలో ఘనంగా రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు ఏముర్ల రంజిత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రావుల దామోదర్ పాల్గొని కేక్ కటింగ్స్ చేయడం జరిగింది. అనంతరం పిల్లలకు పండ్లు, స్వీట్స్, కూల్డ్రింక్స్, కేక్ అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు ఏముర్ల రంజిత్ మాట్లాడుతూ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో రామగుండం నియోజకవర్గం గతంలోలానే మరెన్నో సేవ కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రామగుండం ఉపాధ్యక్షులు మోతే రవికాంత్, బండారి తిరుపతి మరియు గడ్డం సురేష్ గౌడ్, బాబు మియా మరియు కురుమ అజయ్ పాల్గొన్నారు.