ఈదుపురం, సన్యాసి పుట్టుగలో జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు

ఇచ్చాపురం: జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఇచ్చాపురం మండలంలోని ఈదుపురం గ్రామంలో ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ దాసరి రాజు మరియు ఈదుపురం జనసైనికుల ఆధ్వర్యంలో ఈదుపురం గ్రామ పెద్దలు మరియు జనసేన ఎంపీటీసీ అభ్యర్థి బాసి భారతి రెడ్డి, జనసేన యూత్ సభ్యులు చింటూ బెహారా, రాహుల్ బేహారా, నారాయణ బేహారా సహకారంతో మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అలాగే ఇచ్చాపురం మండలం, సన్యాసి పుట్టుగ గ్రామంలో జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, పనపాన కుమార్ ఆధ్వర్యంలో సన్యాసపుట్టుగ గ్రామ జనసైనికులు, గ్రామ పెద్దలు సహకారంతో జెమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం రాగోలు వారి సౌజన్యంతో మెగా వైద్యశిభిరాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు చేతుల దుగా జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా మరియు గ్రామస్తులు సమక్షంలో ప్రారంభించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పుల సమస్యలు మరియు అన్ని రకాల సాధారణ వ్యాధులకు అనుభవజ్ఞులైన వైద్య బృందంతో పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపుకి గ్రామస్తుల నుండి విశేష స్పందన లభించింది. దాదాపుగా 400 మంది ఈదుపురంలో అలాగే 300 మందికి సన్యాసిపుట్టుగలో పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇచ్ఛాపురం మున్సిపాలిటీ 10 వార్డు ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, ఈదుపురం ఎంపీటీసీ అభ్యర్థి బాసి భారతి, వీర మహిళ శైలజ, దుంగు భాస్కర్, దుగాన దివాకర్, కుమార్, రామకృష్ణ, తారక్, రాజు, ఢిల్లీష్, మురళి, ఢిల్లీ, మధు, జ్ఞానేశ్వర్, శేఖర్, వెంకటేష్, మురళి, జానకి రావు, మోహన్, సురేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.