గంగవరం పోర్ట్ నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలి..

  • అఖిలపక్ష సమావేశంలో 64వ వార్డ్ జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి

గాజువాక: గంగవరం పోర్ట్ నిర్యాసితులు యెక్క డిమాండ్ల పరిష్కారం కోసం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, 64వ వార్డ్ జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ గంగవరం పోర్ట్ నిర్వాసితులకు పూర్తి న్యాయం జరగాలని, వారి అతి తక్కువ స్వల్ప జీతంతో కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి తక్షణమే నెలకు 36000 జీతం ఇవ్వాలని మరియు గంగవరం పోర్టు నిర్వాసితులకు రావలసిన రాయితీలు గంగవరం గ్రామం మరియు దిబ్బపాలెం గ్రామంలో నిర్వాసితులు పడుతున్న ఇబ్బందులను పూర్తిస్థాయిలో వారి డిమాండ్స్ ను తీర్చాలని, తొలగించిన కార్మికులను మరియు సస్పెన్షన్ ఉత్తర్వులతో చార్జిషీట్ జారీచేసిన కార్మికులను కూడా విధుల్లోకి తీసుకోవాలని వారికి తగిన న్యాయం చేయాలని దల్లి గోవింద రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. కార్మికుల యొక్క డిమాండ్ ని పరిష్కరించలేని ఎడల ఉద్యమం మరింత తీవ్రంగా ఉంటుందని మా ఆదినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని గంగవరం పోర్ట్ యాజమాన్యాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మరియు కార్మికులు పాల్గొన్నారు.