2024 లో కాబోయే ఏపీ సీఎం పవన్ కళ్యాణ్: సాకే మురళీకృష్ణ

జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయ వ్యూహాలు కొరవడ్డాయని.. ఆయనను కొందరు కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని.. జనసేనపార్టీలో చర్చ జరుగుతుందని పవన్ తర్వాత స్థానంలో వున్న నేత ఇచ్చే రాంగ్ డైరెక్షన్లో పయనిస్తున్నారని.. భవిష్యత్ లో పార్టీకి నష్టం చేకూరుస్తుందని.. జనసేన సీనియర్ నేతలు సైతం అభిప్రాయ పడుతున్నారనే పత్రికల్లో వచ్చిన మాటల్లో వాస్తవాలు లేవని.. మా అధినేత ఎవరి మాట వినే పరిస్థితిలో లేరని.. పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధానంలో ప్రతినియోజకవర్గంను మా అధినేతే స్వయంగా పర్యవేక్షణ చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా ఉన్నారని.. జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ పేర్కొన్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీతో పొత్తు ఉంటుంది. అని రోడ్ మ్యాప్ ప్రకటిస్తే గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసమే రోడ్ మ్యాప్ అడిగారే తప్ప.. మరో విషయం కాదు. టీడీపీ తో పొత్తు ఉంటుందని మా అధినేత ఏ సందర్భంలోను చెప్పలేదు. జనసేనపార్టీ కి ఏపార్టీ పొత్తు వచ్చినా వద్దనము. కానీ జనసేన పార్టీనే అధికారంలోకి వస్తుందని చాలా క్లారిటీగా చెబుతున్నారని తెలియజేసారు. రాష్ట్రంలో జనసేనపార్టీ బలోపేతం అవుతున్నందునే కొంతమంది స్వార్థపరులనాయకులు ఇలాంటి తప్పుడు అభిప్రాయాలను పత్రికలకు ఇస్తున్నారని మండిపడ్డారు. టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందన్నా భావనతో చేరికలు పూర్తిగా నిలిచిపోయాయి అనే మాటల్లో కూడా వాస్తవం లేదు.. ఎందుకంటే పార్టీలో చేరికలు మా అధినేత ఆధ్వర్యంలోను, జిల్లాల్లో, మండలాల్లో చేరికలు రోజు వారీగా జరుగుతూనే ఉన్నాయి. మా అధినేత నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఇరుపార్టీల నుంచి భారీ చేరికలు జరుగుతాయి, మరోసారి గుర్తు చేస్తున్నా.. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జనసేనపార్టీ తో పొత్తుకు వద్దనరు.. ఏ పార్టీతోను మా పార్టీ పొత్తు ఉండదు.. రాష్ట్రంలో జనసేనపార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మా అధినేత సీఎం అవడం ఖాయం. ఎవరి మాటలు పట్టించుకోకుండా ప్రజల సమస్యలపై ఆలోచిస్తూ.. ఆయన సొంత డబ్బులతో.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతులను ఆదుకోవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు మా అధినేత. ఈ వైసీపీ అరాచక పాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి.. రాష్ట్రం అప్పుల భారం నుండి కాపాడి రాష్ట్రప్రజలు సంతోషాలతో వుండే విదంగా మాత్రమే ఆలోచిస్తున్నారని తెలియజేశారు.