ఏ.ఐ.సి.ఎస్ అవార్డు గ్రహీత దామరచర్ల శంకర్రావు సన్మానించిన గాదె వెంకటేశ్వరరావు

గుంటూరు: ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రఫీ రంగంలో ఎంతో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏ.ఐ.సి.ఎస్ వారు నిర్వహించే ఫోటోగ్రఫీ కాంపిటేషన్లో గుంటూరు జిల్లా, ప్రతిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలం, లాలుపురం గ్రామ వాస్తవ్యులు దామరచర్ల శంకర్రావు అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దామరచర్ల శంకర్రావు గారు గత 35 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నారని, ఇప్పుడు వీరు చేసిన ఎఫెక్ట్స్ డాక్యుమెంటరీ కోసం గత 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డారని, ఈరోజు వారి కష్టానికి ప్రతిఫలం దక్కిందని తెలియజేశారు. అలాగే ఇలాంటి అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం బాధకరమని, ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి వారికి ప్రోత్సాహాకాలు అందించాలని తెలియజేశారు. తదననంతరం ఫోటోగ్రఫీ అసోసియేషన్ సభ్యులతో గాదె వెంకటేశ్వరావు మాట్లాడారు. ఫోటోగ్రాఫర్ల పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జిల్లా నాయకులు కొర్రపాటి నాగేశ్వరావు, గుంటూరు జిల్లా సభ్యులు శ్రీనివాస రావు, షరీఫ్, దుర్గాప్రసాద్, హరిబాబు, జనసేన నాయకులు కట్ట అనిల్, దామరచర్ల రామాంజి, పవన్, నాని, లోకేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.