రైతులకు తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని హెచ్చరించిన గాదె వెంకటేశ్వరావు

గుంటూరు జిల్లా జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరావు పొన్నూరు నియోజవర్గం చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి రైతులకు జరుగుతున్న ధాన్యం కొనుగోలులో అవకతవకలపై అధికారులను ప్రశ్నించి రైతులకు తగిన న్యాయం జరిగే విధంగా చూడాలని ప్రభుత్వ అధికారులను హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.