అనంతపురం జిల్లా అధ్యక్షులను కలిసిన మండలాద్యక్షులు

పుట్టపర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షులుగా నియమితులైన సందర్బంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ ను మండల అధ్యక్షులు మేకల ఈశ్వర్, అల్లాడి జయరాం, పూల శివప్రసాద్, మహేష్ లు కలిసి అభినందలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపారు. అనంతరం నియోజకవర్గంలోని సమస్యలు గురుంచి అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ కి వివరించారు. ఈ సందర్భంగా శ్రీ టీ.సీ.వరుణ్ మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి సమస్యల పరిస్కారం కోసం కృషి చెయ్యాలని తెలిపారు. మండలాల అధ్యక్షులకు మరియు కార్యకర్తలకు అండగా ఉంటానని జిల్లా అధ్యక్షులు శ్రీ టీ.సీ.వరుణ్ తెలపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శ్రీ సంజీవ రాయుడు, శ్రీ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.