గాజువాక నియోజకవర్గం 64వార్డ్ యారాడ గ్రామంలో “స్వచ్చ సర్వేక్షన్”

గాజువాక నియోజకవర్గం 64వార్డ్ యారాడ గ్రామంలో జరిగిన “స్వచ్చ సర్వేక్షన్” అనే కార్యక్రమంలో పాల్గొన్న జోనల్ కమీషనర్ శ్రీధర్ మరియు 64వ వార్డ్ జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి. జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి మాట్లాడుతూ “మన చెత్త మన బాధ్యత” మరియు” ప్లాస్టిక్ సంచులు వద్దు – గుడ్డ సంచులు ముద్దు” అనే నినాదం చెప్పడం జరిగింది. అలాగే తడిచెత్త – పొడిచెత్త వేరుచేసి పారిశుధ్య కార్మికులుకు అందజేయాలనీ కోరుతూ… ప్లాస్టిక్ రహిత విశాఖపట్నంగా చేయాలి అని అక్కడ ఉన్న ప్రజలు అందరూ భాగస్వామ్యం అవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే కార్పొరేటర్ యారాడ హైస్కూల్ కు వెళ్లి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ బాగా చదివి తల్లిదండ్రులకు మరియు మన గ్రామంకు మంచి పేరు పాఖ్యతులు సంపాదించి పెట్టాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.హెచ్.ఎం.ఓ వాలంటీర్స్ మరియు శానిటేషన్ సెక్రటరి, శానిటేషన్ ఇన్స్పెక్టర్, గ్రామ పెద్దలు మరియు మహిళలు పాల్గొన్నారు.