యర్రిపిల్లి నూకరాజుకు ఆర్ధికసాయం చేసిన గాజువాక జనసేన

గాజువాక నియోజకవర్గం, జీవీఎంసీ 64వ వార్డ్, గంగవరం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు యర్రిపిల్లి నూకరాజు ఇటీవల రోడ్ యాక్సిడెంట్ కి గురై, అనారోగ్యం కారణంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసి జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జి.వి.ఎమ్.సి 85వ వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర్ రావు మరియు జి.వి.ఎమ్.సి 86వ వార్డు ఇంచార్జ్ కాదా శ్రీను అందించిన ఆర్థిక సహాయం గౌరవప్రదంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జి.వి.ఎమ్.సి 64వ వార్డు కార్పోరేటర్ దల్లి గోవింద రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకుడు ముసలయ్య అధ్యక్షతన ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మెగా నూకరాజు, పి దేముడు, పి నూకరాజు, దాసు, వై రాజబాబు తదితరులు పాల్గొన్నారు.