శక్తివంతమైన నాయకురాలిగా గళ్లా మాధవి

  • వైసీపీ దాష్టీకాలపై గళ్లా మాధవి పోరాటం స్ఫూర్తి దాయకం
  • ప్రజలతో మమేకమవుతూ ప్రచారంలో దూసుకుపోతున్న గళ్లా మాధవి
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: వైసీపీ అరాచకాలపై , దాష్టీకాలపై ధైర్యంగా పోరాడుతూ అతి తక్కువ సమయంలోనే అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఎదిగారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. బ్రిటీష్ పాలకుల నిరంకుసత్వంపై దండెత్తిన వీరనారి ఘాన్సీ లక్ష్మీ బాయి స్పూర్తితో నేడు వైసీపీ అరాచక పాలనపై గళ్లా మాధవి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని కొనియాడారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఘాన్సీ లక్ష్మీ భాయి స్పూర్తితో వైసీపీ పాలనపై దండెత్తిన గళ్లా మాధవి అంటూ ముద్రించిన గోడప్రతులను గళ్లా మాధవి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ వైసీపీ సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళ్లా మాధవి తన గొంతుకను బలంగా వినిపిస్తోందన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంలో ఆమె వ్యూహాత్మకంగా ముందుకు సాగడంతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందన్నారు. మరోవైపు ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుంటున్నారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలపై ప్రజలతో మమేకం అవుతూ పూర్తి స్థాయిలో ఆమె అవగాహన పెంచుకోవడం శుభపరిణామమన్నారు. వైసీపీ మళ్ళీ గెలిస్తే ఊహించని స్థితిలో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో మానవత్వం, సేవాతత్వం నిండిన మాధవిని గెలిపిస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని ఆళ్ళ హరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి మాట్లాడుతూ వైసీపీ నిరంకుశ పాలనపై క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఉపాధి లేక ఉద్యోగాలు లేక జీవనోపాదికరువై సామాన్య ప్రజానీకం పడుతున్న బాధలు వర్ణనాతీతమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, విజనరీ చంద్రబాబు నాయుడు, ప్రజా పోరాటాయోధుడు పవన్ కల్యాణ్ ల ఆశీస్సులతో ముందుకు సాగుతున్న తనకు ప్రజలు అండగా నిలుస్తున్నారని వారికి ఎప్పటికీ తాను రుణపడి ఉంటానన్నారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తనని గెలిపిస్తే ప్రజల్ని కంటికి రెప్పలా చూసుకుంటానని గళ్లా మాధవి అన్నారు. కార్యక్రమంలో రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దిన్, గుర్రాల ఉమ, కొలసాని బాలకృష్ణ, దండే అన్వేష్, వడ్డె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.