గంగవరం పోర్టు లాభాలు ఆదానికి-రోగాలు ప్రజలకు: కోన తాతారావు

గంగవరం పోర్టు పొల్యూషన్ పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రజలు ప్రాణాలు కాపాడాలని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి కోన తాతారావు పెదగంట్యాడ జంక్షన్ లో ఏర్పాటు చేసిన ధర్నాలో అన్నారు. పోర్టులో..గాలిలో ఎగరకుండా ఎటువంటి ప్రీవెంటివ్ మెజర్సు తీసుకోకుండా కోల్, ఐరన్ ఓర్, పెర్టిలైజర్, లైంస్టోన్, బాక్సైట్ లను ఓపెన్ యార్డ్స్ లో స్టాక్ చేయుటం హ్యాండలింగ్ చేయటం వలన ధూళి, దుమ్ముతో పాటు రసాయనాలు పౌడర్ గాలిలో కలిసి 10కిలోమీటర్లు వ్యాసార్థంలో వస్తున్న వాయు కాలుష్యం వలన 16 గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురౌతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండ చూసుకొని ఆంధ్రప్రదేశ్ పిసిని విధించే నియమ, నిబంధనలు గంగవరం ఆదాని పోర్టు యాజమాన్యం పట్టించుకోకుండా చివరకు లారీలపై రవాణా అవుతున్న బొగ్గు పైన టర్పాల్ కూడా వేయని పరిస్థితులు ఉన్నాయి. పోర్టు లాభాల్లో ఉంది. 2022 ఆర్థిక సమత్సరంలో 30 మిలయన్ టన్నులు కార్గో హ్యాండ్లింగ్ ద్వారా 1293కోట్లు లాభాలు అర్జించిన చుట్టుపక్కల గ్రామాలను పట్టించుకోకపోవటం దుర్మార్గం. బాధిత ప్రజల తరుపున అండగా నిలవాల్సిన స్థానిక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, ఎంపి ఎం.వి సత్యనారాయణ పోర్టు యాజమాన్యంతో అంటకాగడం ఓట్లేసిన ప్రజలకు మోసం చేయుటమేనని కోన తాతారావు అన్నారు.

  • కాలుష్యం కారణంగా ప్రజల ఆయుష్షు.. ఆయుష్షుగా మారుతుంది

ఉపాధి కోల్పోయిన మత్సకార గ్రామాలు గంగవరం దిబ్బ పాలెం, నిర్వసితులైన పెడగంట్యాడ ఆర్.హెచ్ కాలనీలు, హెచ్.బి కాలనీ తదితర గ్రామల ప్రజల ఇళ్లల్లో రోజుకు రెండు సెంటిమీటర్లు ఎత్తున కోల్ డస్ట్ చేరుతుండంతో కంటి వ్యాధులు, ఊపిరితిత్తులు, కిడ్నీ, స్వాసకోస వ్యాధులుతో తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సివస్తుందని, సత్వర చర్యలు తీసుకోకపోతే పోర్టు యాజమాన్యంపై జనసేన పార్టీ కలిసొచ్చే ప్రజా సంఘాలను కలుపుకుని ప్రజా ఉద్యమం నిర్మిస్తామని కోన తాతారావు హెచ్చరించారు. కోన చినఅప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు, దల్లి గోవింద రెడ్డి, తిప్పల రమణారెడ్డి, దాసరి జ్యోతి రెడ్డి, రౌతు గోవింద్, సోమశేఖర్, వీరుబాబు, ముసలయ్య, మూర్తి, వంశీ, సోమన్న, రామారావు తదితరులు పాల్గొన్నారు.