సేనా వారాహి యాత్రకు సిద్దంకండి.. పాటంశెట్టి

జగ్గంపేట నియోజకవర్గం: జూన్ 14వ తేదీన అన్నవరం సత్యదేవుని క్షేత్రం నుండి ప్రారంభించనున్న వారాహి యాత్రను విజయవంతం చేయడం కొరకు రాష్ట్ర నాయకులు కోన తాతారావు మరియు వడ్రాణం మార్కండేయ బాబు జగ్గంపేట నియోజకవర్గానికి విచ్చేసారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గండేపల్లి మండలం, ఉప్పలపాడు గ్రామంలో నియోజకవర్గంలోని జనసైనికులు అందరితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర మాట్లాడుతూ.. జూన్ 14న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కత్తిపూడిలో నిర్వహించే భారీ భహిరంగ సభకు నియోజకవర్గం నుండి వేల సంఖ్యలో జనసైనికులు తరలి వెళ్లి సభను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. తదుపరి వారాహి యాత్ర పోస్టరును ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ మీ నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, జిల్లా కమిటీ నాయకులు అంతా కలిసి చర్చించుకుని 14న జరగబోయే వారాహి విజయ యాత్రను మరియు కత్తిపూడిలో జరిగే భారీ భహిరంగ సభను విజయవంతం చేసే దిశగా ప్రయాణం సాగించాలని, తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.