జనసేనానికి ఒక్క అవకాశం ఇవ్వండి: బండారు శ్రీనివాస్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ శనివారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు నిలబడే పార్టీ, ఒక్క జనసేన పార్టీ అని, జనసేనాని పవన్ కళ్యాణ్ వారు అందరూ వారని, వారు ఏ కొందరికో కాదని, అన్ని కులాలకు సమన్యాయంతో అందరినీ ముందుకు నడిపించే గొప్ప మనసుతో, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు, ఎవరు కష్టాల్లోకి, పేదరికంలోకి వెళ్ళకూడదని, రాష్ట్రంలో ఎక్కడ అవినీతి అనేది జరగకుండా రాష్ట్రాన్ని కాపాడాలని, నీతి నిజాయితీలతో, కంకణ బుద్ధుడై నిలబడి పోరాడుతూ, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎన్నో అవమానాలను భరిస్తూ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యమని, తాను నమ్మిన నీతి కోసం, రాష్ట్ర ప్రజల చేయి విడవని నాయకుడికి ఈ రాష్ట్ర ప్రజలు రేపటి రోజుల్లో ముఖ్యమంత్రిగా ఒక్క అవకాశం ఇవ్వాలని, ప్రజలందరికీ దీవెనలతో, ఒక్కసారి రాబోయే రోజులకు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే గొప్ప నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, కష్టం తెలిసిన నాయకుడు, పేదవారిపట్ల జాలి దయ, కరుణ కలిగిన మానవతావాదిగా, అందరిపై కరుణ చూపించే కరుణామయుడుగా, ఈ రాష్ట్ర ప్రజల అందరి దీవెనలు పవన్ కళ్యాణ్ వారికి నిండుగా మెఒడుగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్ర ప్రజలారా! కొత్తపేట నియోజకవర్గ ప్రజలారా! జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి! ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయని నాయకుడిగా! అవినీతిని అంతమొందించే గొప్ప సైనికుడిగా! రాష్ట్ర ప్రజలకు చరిత్రలో నిలబడి పోయే గొప్ప పరిపాలనాదక్షుడిగా నిలబడతారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఆశీస్సులు, దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇన్చార్జిగా నిలబడి నా వంతుగా, జనసైనికులతో, కార్యకర్తలతో నిరంతరం కృషి చేస్తూ, జనసేనాని లాంటి గొప్ప నాయకుడి కోసం నీతిగా నిలబడడానికి, వారి అడుగులో అడుగు కలుపుతూ, కొత్తపేట నియోజకవర్గ నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, ప్రజలందరికీ సహకారంతో ఏ మచ్చ లేకుండా ముందుకు సాగుతానని హామీ ఇచ్చుచున్నాను. న్యాయం వైపు నిలబడమని, ధర్మం వైపు నడిపించే నాయకుడి జనసేనానికి అండగా ప్రతి ఒక్కరూ తోడుగా కలిసి రావాలని కోరుకుంటూ ఉన్నాను.