నూతన వధూవరులకు గాజు గ్లాసు బహుకరణ

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, యల్ యల్ పురం గ్రామానికి చెందిన జనసేన జామి అనిల్ సునీత పెళ్ళివేడుకలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మరియు మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల జనసేన నాయుకులు జనసైనికులు పాల్గొని వధువు వధూవరులను ఆశీర్వదిస్తూ నూతన జంటకు దైవ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని మనసారా కోరుకుంటూ నూతన వధూవరులకు పాలకొండ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత ఫ్రేమ్ తో పాటుగా జనసేన జెండా మరియు జనసేన సింబల్ గాజు గ్లాస్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గం జనసేన నాయుకులు, జనసైనికులు పాలకొండ నియోజకవర్గం నాలుగు మండల జనసేన నాయుకులు జనసైనికులు పాల్గొన్నారు.