మానవత్వం చాటుకున్న గొండ్రియాలా జనసైనికులు

మాతృ దినోత్సవం రోజున మానవత్వం చాటుకున్న గొండ్రియాలా జనసేన పార్టీ జనసైనికులు, నాయకులు. ప్రాణప్రదాత జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానంలో నడుస్తూ గత కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి దారెల్లి మెరినాకు ఆర్థికసహాయం 5000 రూపాయిలు అందించడం జరిగింది. చిన్నారి తల్లి దారెల్లి నయోమి తండ్రి అశోక్ నివాసం గొండ్రియాలా గ్రామం వీరు రోజువారి కూలి పని చేసుకుంటారు తన కూతురు పడుతున్న బాధను చూసి గొండ్రియాలా జనసైనికులు నాయకులు ఆర్థిక చేయూతనివ్వడం జరిగింది. ఈ చిన్నారికి ఆర్థిక సాహాయాన్ని అందిచగలరని గొండ్రియాల జనసేన నాయకులు కోరడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యాదర్శి టి. నవీన్, వై.గోపి, ఎం. మహేష్, ఆర్గనైజేయింగ్ సెక్రెటరీ పి. కిషోర్, అనిల్, రాజు, గోపి, సందీప్, రాజు, రాజేష్, నాగరాజు, వెంకాయి, వినోద్, శ్యామ్, పాపరావు, డివిడి, జానీ పాషా తదితరులు పాల్గొన్నారు.