రోడ్లకు గుంతలు పూడ్చవలసిన బాధ్యత ప్రభుత్వానిదే: నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్, స్థానిక జనసైనికులతో కలిసి నల్లపురెడ్డి పల్లి, మురుగళ్ల, కనుపూరు పల్లి గ్రామాలను, ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రానికి కలిపే గుంతల మయమై, ప్రయాణానికి దుర్భరంగా తయారయిన రహదారిని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, రోడ్లకు గుంతలు పూడ్చి, రహదారులను ప్రజలకు ఉపయోగపడేలా తయారుచేయవలసిన బాధ్యత ప్రభుత్వంనిదే అన్నారు. న్యాయ వ్యవస్థతో, సహా పలు ప్రజాస్వామ్య వ్యవస్థల పై కొందరు సోషల్ మీడియా వేదికగా దాడికి పూనుకోవడం అత్యంత శోచనీయం అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో తమ ప్రాణాలకు తెగించి సేవ చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖతో సహా, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కృషి ఎంతో ప్రశంసనీయం. చివరికి తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయ వ్యవస్థపై కూడా హేయమైన రీతిలో సోషల్ మీడియా వేదికగా దాడులకు దిగడం ఎంతో శోచనీయమన్నారు. ఇటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సేవలందించిన ఉద్యోగులు, తమ న్యాయమైన కోర్కెల సాధనకై ఉద్యమ బాట పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారికి అండగా జనసేన పార్టీ నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని, సమ్మె దిశగా తమ పయనాన్ని కొనసాగిస్తున్న ఉద్యోగులతో చర్చలు జరిపి తగిన పరిష్కారాన్ని కనుగొనాలని జనసేన పార్టీ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షులు పత్తిపాటి ప్రవీణ్ తో సహా పలువురు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.